హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ అభివృద్ధి పనులను సమీక్షించిన ఎమ్మెల్యే

PLD: రెంటచింతల మండలం, సత్రశాలలోని శ్రీగంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూ.5 కోట్ల నిధులతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పనుల నాణ్యత, ప్రణాళికపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.