హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లాలో ఏకగ్రీవాలపై జోరుగా చర్చలు

కృష్ణా: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఏకగ్రీవాలపై చర్చలు ఊపందుకున్నాయి. గత ఎన్నికల్లో 19 మండలాల్లో 51 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈసారి ప్రోత్సాహకాలు పెరగడంతో మరిన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బందరు, పెడన నియోజకవర్గాల్లో కూటమి నేతలు చర్చలు జరుపుతుండగా, కొన్ని గ్రామాల్లో వైసీపీ నేతలు కూడా ఏకగ్రీవానికి ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.