TPT: శ్రీకాళహస్తిలో MGM హాస్పిటల్స్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. కొండమిట్ట, వెలమపాలెం పాల డిపో సమీపంలో జరిగిన ఈ శిబిరానికి కొండమిట్ట, ఎన్టీఆర్ నగర్, వెలమపాలెం ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది హాజరయ్యారు. వైద్యులు వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్య సేవలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
MGM హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శిబిరం


