హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ వేడుకల్లో ఎమ్మెల్యే దంపతులు

CTR: సదుం వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ నిర్వాహకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.