హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అంతర్వేది సుదర్శన హోమంలో పాల్గొన్న భక్తులు

కోనసీమ: సఖినేటపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీకమాసం ఆదివారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సన్నిధిలో నిర్వహించిన సుదర్శన హోమంలో భక్తులు పాల్గొని, మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.