హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు, ఆటో ఢీ.. తప్పిన ప్రమాదం

E.G: రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని ధవళేశ్వరం హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్ద ఇన్నోవా కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడింది. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఆటోతో పాటు ఇన్నోవా కారుకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.