హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 20 వరకు కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం

ATP: తాడిపత్రి పట్టణ కేంద్రంలో ఈ నెల 20వ తేదీలోగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల విభాగం డీటీ నాగేంద్రప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారంతా అర్హులన్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు ఫొటో, వయస్సు నిర్ధారణ ధ్రువీకరణ పత్రాలతో కూడిన దరఖాస్తులను అందజేయాలన్నారు.