హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

ELR: గ్రంథాలయాలు విజ్ఞాన సర్వస్వాలు, జాతికి జీవనాడి వంటివని, పలువురు పేర్కొన్నారు. భీమడోలు శాఖ గ్రంథాలయంలో, 59వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, ఆదివారం కార్యక్రమాలు జరిగాయి. సభకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా డైరెక్టర్ ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి డాక్టర్ జటావల్లభుల సాయిరాం మాట్లాడుతూ గ్రంథాలయ విస్తరణలో మహనీయుల సేవలు కొనియాడారు.