హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు పుస్తక పఠనం తప్పనిసరిగా ఉండాలి

VZM: విద్యార్థులకు పుస్తక పఠనం తప్పనిసరిగా ఉండాలని గజపతినగరం శాఖ గ్రంధాలయ అధికారిని యజ్జల స్వప్న అన్నారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం గ్రంధాలయం లో పుస్తక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కొంత సమయాన్ని గ్రంథాలయాల‌కు కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.