హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చింతలపూడిలో బొగ్గు నుంచి గ్యాస్ ప్లాంట్

ELR: చింతలపూడి సమీపంలో రిలయన్స్ సంస్థ 43 వేల కోట్ల రూపాయల వ్యయంతో బొగ్గు నుంచి గ్యాస్ తయారీ ప్లాంటును ప్రారంభించనుంది. భవిష్యత్తులో ఈ పెట్టుబడులు 2.5 లక్షల కోట్లు చేరే అవకాశం ఉంది. దీనివల్ల సుమారు 40,000 మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అయితే ఈ ప్లాంట్ నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.