హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండారం యువకుడికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు

SDPT" బెజ్జంకి మండలం గుండారం గ్రామానికి చెందిన పుల్ల అజయ్ టీజీపీఎస్సీ నిర్వహించిన నియామక పరీక్షలో అసిస్టెంట్ సైంటిఫిక్ అనలిస్ట్ గ్రేడ్-2 ఉద్యోగానికి ఎంపికై రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. పుల్ల యాదయ్య, విజయ దంపతుల కుమారుడైన అజయ్ విజయంతో గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. కుటుంబసభ్యులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.