హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎన్టీఆర్ జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ నెల 26న 73 గ్రామపంచాయతీలు, 856 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పోలింగ్ రోజునే ఫలితాలు వెల్లడిస్తామని అన్నారు.