హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

KRNL: విద్యార్థులు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు. ఆదివారం ఎస్సీ కాలేజ్ బాయ్స్ నంబర్‌–1 హాస్టల్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాదకద్రవ్యాల దుష్పరిణామాలను వివరించారు. గంజాయి అక్రమ విక్రయాల సమాచారం తెలిస్తే అధికారులకు తెలియజేయాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.