హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో PLI, RPLI సేవలకు బ్రేక్

CTR: జిల్లాలో తపాలా జీవిత బీమా (PLI), గ్రామీణ తపాలా జీవిత బీమా (RPLI) సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుంది. ఇన్సూరెన్స్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 16 నుంచి 25వ తేదీ వరకు సేవలు నిలిచిపోతాయని పోస్టల్ సూపరింటెండెంట్ కిరణ్ తెలిపారు. ఈ నెల 26 నుంచి సేవలు తిరిగి యథావిధిగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.