హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పెరుగు చలవ చేస్తుందా? అసలు నిజమిదే!

పెరుగు చలవ చేస్తుందని చాలామంది భావిస్తారు. కానీ ఆయుర్వేదం ప్రకారం పెరుగుకు శరీరంలో ఉష్ణాన్ని(వేడి) పెంచే గుణం ఉంటుంది. ఇది జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అలాగే శరీరంలో కఫ, పిత్త దోషాలను పెంచి వాతాన్ని తగ్గిస్తుంది. అందుకే పెరుగును రాత్రిపూట అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే దీన్ని పలుచని మజ్జిగలా చిలికి తాగితే మాత్రం శరీరానికి అమితమైన చలవ చేస్తుంది.