హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోగనిరోధక వ్యవస్థ బాగుండాలంటే..!

రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్ C కలిగిన నిమ్మజాతి పండ్లు, పాలకూర, క్యాప్సికం తీసుకోవాలి. విటమిన్ B6 ఉన్న అరటిపండ్లు, చికెన్, చేపలు, శెనగలతో పాటు పొద్దుతిరుగుడు గింజలు, బాదంపప్పు, పల్లీలు(విటమిన్ E) తినాలి. అంతేకాదు క్యారట్, గుమ్మడికాయ, చిలగడదుంప(విటమిన్ A), ఉదపు ఎండ, చేపలు, కోడిగుడ్లు(విటమిన్ D) వంటివి ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.