భోజనం తర్వాత తరచూ ఛాతీలో మంట, నోట్లో పుల్లటి రుచి రావడం GERD (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి) లక్షణాలు కావచ్చని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్లు చెబుతున్నారు. నిద్రకు 1-2 గంటల ముందే భోజనం చేయడం, తిన్న వెంటనే పడుకోకపోవడం, కారం, నూనె, కెఫీన్ తగ్గించడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. ఛాతీ నొప్పి వస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఆరోగ్యం
తరచూ ఎసిడిటీనా? ఇలా చేయండి!


