హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలు తనిఖీ చేసిన MPDO

VZM: బొబ్బిలి MPDO పి.రవికుమార్ ఆదివారం గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ మేరకు పెంట, ఎం.బూర్జవలస స్వర్ణ సచివాలయాలు వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నామినేషన్లు స్వీకరణ సక్రమంగా నిర్వహించాలని ఎన్నికల సిబ్బందికి ఆదేశించారు. విధులు నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.