హైదరాబాద్: 28°C
క్రైమ్

వ్యాపారి కిడ్నాప్ కేసులో ఐదుగురు అరెస్ట్

AP: అన్నమయ్య జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసులో ఐదుగురు అరెస్ట్ అయ్యారు. సీబీఐ అధికారుల పేరుతో మదనపల్లెలో వ్యాపారి సాదిక్​ను కిడ్నాప్ చేశారు. బాధితుడు నుంచి రూ.5 కోట్ల కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. డబ్బు కోసం వస్తుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి కారు, నకిలీ తుపాకి, ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.