AP: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుంటుపల్లి ఎస్ఆర్ కళాశాలలో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. కళాశాలలోని తరగతి గదిలో ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి కళాశాల యాజమాన్యం తరలించింది. మృతి చెందిన విద్యార్థి జగ్గయ్యపేటకు చెందిన జావేద్గా గుర్తించారు. రెండు రోజుల క్రితమే ఆమె ఇంటి నుంచి కళాశాలకు వచ్చింది.
క్రైమ్
విషాదం.. తరగతి గదిలో విద్యార్థిని ఆత్మహత్య


