AP: విజయవాడ కృష్ణలంకలోని రామయ్య లాడ్జిలో పైడిశెట్టి ఎర్రమ్మ హత్యకు గురైంది. రెండు రోజులుగా భార్య కనిపించడం లేదంటూ భర్త సూర్యారావుపేట పీఎస్లో ఫిర్యాదు చేయగా.. బస్టాండ్ ఎదురుగా ఉన్న లాడ్జిలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఓ యువకుడితో కలిసి లాడ్జికి వచ్చిన ఎర్రమ్మను హత్య చేసిన నిందితుడు, గది తలుపు లాక్ చేసి పరారైనట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
లాడ్జిలో మహిళ దారుణ హత్య


