హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధ్వానంగా మారిన కోటపాడు రహదారి

ప్రకాశం: పొన్నలూరు మండలం కోటపాడుకి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రహదారిపై వేసిన కంకరలేచిపోవడంతో ద్విచక్ర వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిపై ప్రయాణించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనదారులతో పాటు కాలినడకన వెళ్లే బాటసారులు కూడా అవస్థలు పడుతున్నారు.