AP: అనకాపల్లి జిల్లాల్లో వరాహ నదిలో స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురు యువకులు మృతిచెందారు. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు వద్ద శనివారం నదిలో ఆరుగురు యువకులు స్నానానికి దిగారు. అందులో ముగ్గురు సురక్షితంగా బయటకు రాగా.. రిషి (18), నాగవంశీ (22), జగదీష్ (20) గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం వారి మృతదేహాలు నదిలో కనిపించడంతో స్థానికులు, పోలీసులు బయటకు తీసుకొచ్చారు.
క్రైమ్
విషాదం.. ముగ్గురు యువకులు మృతి


