హైదరాబాద్: 28°C
క్రీడలు

ధోనీ, సచిన్, కోహ్లీల సరసన యశ్ ఠాకూర్

NZతో జరుగుతున్న ఐదో వన్డేలో అరంగేట్రం చేసిన భారత ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్‌కు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. బ్యాటింగ్‌లో ఖాతా తెరవకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో వన్డే అరంగేట్రంలో సున్నాకే ఔటైన భారత ఆటగాళ్ల జాబితాలో చేరాడు. గతంలో సచిన్, లక్ష్మణ్, ధోనీ, రైనా, ధావన్ (2010) ఈ జాబితాలో ఉండగా, 16 ఏళ్ల తర్వాత యశ్ ఠాకూర్ ఈ రికార్డును మూటగట్టుకున్నాడు.