క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిమానులతో తన చిన్ననాటి జ్ఞాపకాన్ని పంచుకున్నారు. తన చిన్నప్పటి ఫొటోతో పాటు ప్రస్తుత ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ రెండు ఫోటోల్లో సచిన్ చేతిలో ఒకే బ్యాట్ ఉండటం విశేషం. 'నా మొదటి బ్యాట్.. 49 ఏళ్ల తర్వాత కూడా ఇది ఇప్పటికీ నా దగ్గరే సురక్షితంగా ఉంది' అంటూ సచిన్ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
క్రీడలు
బ్యాట్‌ను 49 ఏళ్లుగా దాచుకున్న సచిన్


