హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

గౌహటికి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో టెకాఫ్‌ అయిన వెంటనే సాంకేతిక సమస్య తలెత్తింది. ల్యాండింగ్ గేర్ ముడుచుకోకుండా అలాగే ఉండడంతో పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో పుణె ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీని విధించారు. అనంతరం పైలట్ సురక్షితంగా మళ్లీ పుణె విమానాశ్రయంలో ల్యాండింగ్‌ చేశారు. ఆ సమయంలో విమానంలో 192 మంది ప్రయాణికులు ఉన్నారు.