ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ వన్డే క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో హాఫ్ సెంచరీ (62) సాధించి, ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో 50 అర్ధశతకాలు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన 21వ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ (96), కోహ్లి (80) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
క్రీడలు
రూట్ మరో చరిత్ర


