హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా కప్‌ హీరోకు బంపరాఫర్‌

భారత అండర్-19 ఆసియా కప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్ మోహిత్ ఉల్వాకు అదిరిపోయే అవకాశం దక్కింది PAKతో జరిగిన ఫైనల్లో చివరి బంతికి బౌండరీ బాది భారత్‌ను గెలిపించిన అతడిని, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం సౌరాష్ట్ర సీనియర్ జట్టులోకి ఎంపిక చేశారు. మోహిత్ ప్రతిభ, పోరాటపటిమను గుర్తించి ఈ అవకాశం కల్పించినట్లు ఎస్‌సీఏ అధ్యక్షుడు జయదేవ్ షా వెల్లడించారు.