హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన భారత షట్లర్

బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ అరుదైన ఘనత సాధించాడు. జపాన్ మాస్టర్స్ (సూపర్ 500) టోర్నీలో కొకి వటనబేపై ఉత్కంఠ విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన తొలి భారతీయ షట్లర్‌గా లక్ష్య సేన్ చరిత్ర సృష్టించాడు. ఫైనల్ పోరులో తొలి గేమ్ కోల్పోయినా, అద్భుతమైన పోరాటపటిమతో పుంజుకుని 13-21, 21-18, 21-14 తేడాతో విజయాన్ని కైవసం చేసుకున్నాడు.