హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంకర తేలి అధ్వానంగా మారిన రోడ్డు మార్గం

ADB: తాంసి మండలంలోని కప్పర్ల నుంచి పోచ్చర వరకు వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా అధ్వానంగా మారింది. రోడ్డు మార్గం పూర్తిగా కంకర తేలి ఉండటంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలు జారిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. అధికారులు స్పందించి రోడ్డు మార్గాన్ని బాగు చేయాలని కోరుతున్నారు.