హైదరాబాద్: 28°C
వార్తలు

ఇద్దరు పోలీసుల హత్య వెనక మసీదు: బీజేపీ ఎమ్మెల్యే

జమ్మూకశ్మీర్ కిష్త్వార్ జిల్లాలో ఇద్దరు SPOలు హత్యకు గురైన ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ జంట హత్యల వెనక స్థానికంగా కుట్ర జరిగి ఉండొచ్చని బీజేపీ ఎమ్మెల్యే షుగన్ పరిహార్ ఆరోపించారు. గతంలో ఆ ఇద్దరు SPOలకు ఓ మసీదు నుంచి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. ఈ బెదిరింపులపై అప్పట్లో ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.