హైదరాబాద్: 28°C
వార్తలు

బంగ్లాదేశ్‌కు భారీ షాకిచ్చిన భారత్‌!

భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న గంగా జలాల పంపిణీ ఒప్పందాన్ని పునరుద్ధరించకుండా గడువు ముగిసేలా చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 1996లో కుదిరిన గంగా జలాల ఒప్పందం డిసెంబర్ 12తో ముగియనుంది. ఈ తరుణంలో పాత ఒప్పందాన్ని యథాతథంగా కొనసాగించకుండా కొత్త నిబంధనలతో చర్చలు జరపాలని భారత్ భావిస్తున్నట్లు సమాచారం.