హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాళోజీ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకం

NLG: మిర్యాలగూడలోని విజేత డిగ్రీ కళాశాలలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో కాళోజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ధనుంజయ మాట్లాడుతూ.. కాళోజీ ప్రజల గొంతుకగా, అణచివేతకు వ్యతిరేకంగా కలంతో పోరాడిన గొప్ప ప్రజాకవిగా కొనియాడారు. ఆయన రచనలు నేటికీ ప్రజల్లో చైతన్యం నింపుతున్నాయని, కాళోజీ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు.