హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 18న ఎస్జీఎఫ్ షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 18న ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అండర్‌-14, 17 బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణుగోపాల్ తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ కార్డులతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.