హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పత్తి దగ్ధం

MNCL: మందమర్రి మండలం అదిల్ పేట్ గ్రామంలో రైతు కొట్రాంగి శ్రీనివాస్‌కు చెందిన పత్తి ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ప్రమాదంలో 2 నుంచి 3 క్వింటాళ్ల పత్తి కాలిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన స్థలాన్ని గ్రామ సర్పంచ్ పున్నం, ఉపసర్పంచ్ రాజన్న పరిశీలించారు. అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని బాధిత రైతు వేడుకున్నాడు.