హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

NZB: రుద్రూర్ చెరువులో ఇవాళ గుర్తు తెలియని ఓ వృద్ధుని (60-65) మృతదేహం లభ్యమైంది. చెరువు కట్టపై ఓ సైకిల్ కూడా నిలిపి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రుద్రూర్ పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు వెంటనే రుద్రూర్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.