హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా రాముల వారి నిత్య కళ్యాణం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఆదివారం నిత్య కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాత సేవ అనంతరం అర్చకులు ఉత్సవమూర్తులకు వేదమంత్రోచ్ఛారణల నడుమ పుణ్యాహవాచనం, కన్యాదానం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.