హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డిజిటల్ అరెస్ట్' ఉచ్చులో పోలీసులు?

HYD: సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాకుండా ఏకంగా IPSల నుంచి కానిస్టేబుళ్ల వరకు పోలీసులనే బురిడీ కొట్టిస్తున్నారు. డిజిటల్ అరెస్టులు, హనీట్రాప్‌ల, పెట్టుబడుల పేరుతో ఈ ఏడాది 60 మందికిపైగా పోలీసులు, వారి బంధువులు రూ. 60కోట్ల వరకు పోగొట్టుకున్నట్లు సమాచారం. పరువు పోతుందనే భయంతో బాధితులు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. సైబర్ పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు.