హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

GDWL: ధరూర్ మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వేడుకలకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే వాల్మీకి విగ్రహానికి ఆవిష్కరించి విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... వాల్మీకి రామాయణం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు.