హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు

MDK: ప్రపంచ ప్రఖ్యాత మెదక్ సీఎస్ఐ చర్చిలో ఆదివారం సండే స్కూల్ ప్రత్యేక ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. క్రీస్తు జీవిత విశేషాలు, అద్భుత కార్యాలను చిన్నారులు నాటక రూపంలో ప్రదర్శించారు. అనంతరం వారు ఆలపించిన గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. విశ్వాసులు భారీగా తరలిరావడంతో చర్చి ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.