హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు సందేహాలకు కిసాన్ కాల్ సెంటర్ అభయం

MDK: వ్యవసాయంలో ఎదురయ్యే సందేహాల నివృత్తికి కిసాన్ కాల్ సెంటర్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రేగోడ్ మండల వ్యవసాయాధికారి శ్రీదేవి సూచించారు. 1800-180-1551 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి విత్తనాలు, ఎరువులు, సస్యరక్షణపై ఉచిత సలహాలు పొందవచ్చన్నారు. తెలుగు సహా 22 భాషల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.