హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూలేందుకు సిద్ధంగా వాటర్ ట్యాంక్

KMR: కామారెడ్డి మున్సిపల్ 2వ వార్డు అడ్లూర్ ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరి, గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఎప్పుడు కూలుతుందోనని కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, వెంటనే కొత్త ట్యాంక్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.