హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేములవాడలో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య

SRCL: వేములవాడ ముదిరాజ్ వీధికి చెందిన ప్రైవేట్ టీచర్ వేముల శ్రీలత (35) నవంబర్ 13న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫోన్‌లో పరిచయమైన వ్యక్తి వేధింపుల వల్లే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారని సీఐ వీరప్రసాద్ తెలిపారు. భర్త గల్ఫ్‌లో ఉండగా, ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లి చంద్రమ్మ ఫిర్యాదుతో కేసు నమోదైంది.