హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్ల ఆక్రమణల తొలగింపునకు గ్రామస్థుల ఫిర్యాదు

JGL: ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో రోడ్లు, గ్రామ స్థలాల ఆక్రమణలపై గ్రామస్థులు పంచాయతీలో ఫిర్యాదు చేశారు. పాత పంచాయతీ వెనుక నుంచి రామాలయం వరకు, మైసమ్మ బురుజు నుంచి లంబాడీ తండా వరకు రోడ్లను ఆక్రమణల నుంచి విముక్తి చేసి పునరుద్ధరించాలని కోరారు. ఈ మేరకు పంచాయతీ కారోబార్ శ్రీనివాస్కు ఫిర్యాదు అందజేశారు. గతంలో ఫిర్యాదులు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.