KNR: రామడుగు మండలం గోపాలరావుపేటలో విద్యుత్ వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెంచి చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలో కొంతకాలంగా దొంగతనాలు జరుగుతున్నాయని, గతంలో విద్యుత్ మోటార్లను సైతం ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి దొంగలను పట్టుకోవాలని కోరారు.
తెలంగాణ
'విద్యుత్ వైర్ల దొంగతనాలపై చర్యలు తీసుకోవాలి'


