PDPL: ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామ శివారులోని రాములపల్లి రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు 16 కేవీఏ డీటీఆర్ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులోని సుమారు 5 కిలోల రాగి తీగను చోరీ చేశారు. దీని విలువ రూ.10 వేలుగా ఉంటుందని అదనపు సహాయక ఇంజినీర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం.. రాగి తీగ చోరీ


