SRPT: అనంతగిరి–వల్లాపురం, చనుపల్లి–పాలవరం, అమీనాబాద్ రహదారులపై రైతులు ధాన్యం ఆరబోస్తున్నారు. మూలమలుపుల వద్ద ధాన్యం పోయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాలవరం తండాకు చెందిన నాగరాజు ధాన్యం రాశులపై పడి మృతి చెందాడు. మరో ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
రహదారులపై ధాన్యం రాశులు.. ప్రమాదాల భయం


