హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌ 181 సీట్లు అడుగుతోంది: అఖిలేష్

యూపీలో BJP ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఇండీ కూటమితోనే ముందుకెళ్తామని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో BSPతో పొత్తు విషయం ఆలోచించడం లేదన్నారు. ఇప్పటికే 403 సీట్లలో ఎన్ని చోట్ల పోటీ చేయాలో నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ 181 సీట్లు అడుగుతోందని చెప్పారు. అయోధ్య రామాలయంలో విరాళాల చోరియే ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారనుందని వెల్లడించారు.