AP: ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం హడలెత్తిస్తోంది. తెల్లవారుజామున జీలుగుమిల్లిలోని పాలచర్ల వెళ్లే దారిలో పెద్దపులి ప్రత్యక్షమైంది. రోడ్డుపైకి వచ్చిన పులి, అటుగా వచ్చిన కారు లైట్ వెలుతురు పడగానే లోపలికి వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పులి సంచారంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. బయటక వెళ్లాలంటే భయపడుతున్నారు.
వార్తలు
హడలెత్తిస్తున్న పెద్దపులి


