హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 20న భీమన్న ఉత్సవ దర్బార్

NZB: ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని భీమన్న ఆలయం వద్ద ఈ నెల 18న జరగాల్సిన భీమన్న ఉత్సవ దర్బార్ అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 20న నిర్వహించనున్నట్లు ఆదివాసీ నాయక్‌పోడ్ సంఘం నాయకులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్, శనివారం పేర్కొన్నారు.